జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
నగరం, మేజర్ న్యూస్: బాపట్ల జిల్లా, మండల కేంద్రమైన నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఈ నెల 27, 28 తేదీలలో కళాశాల కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఐక్యూఏసీ సహకారంతో "వికసిత భారతం కోసం కృత్రిమ మేధస్సు: ఆవిష్కరణలు, అవకాశాలు, భవిష్యత్తు సవాళ్లు” అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి జి. అనురాధ తెలిపారు. ఆదివారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఛాంబర్ లో జాతీయ సదస్సు బ్రోచర్‌ను కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఆర్. ప్రసన్న బాబు, కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డిలు ఆవిష్కరించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతోందని, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో ఏ ఐ సరికొత్త అవకాశాలను సృష్టిస్తోందని వారు అన్నారు. జాతీయ సదస్సుకు కో-కన్వీనర్లుగా ఎస్. శ్రీనివాసరావు, యు. శివ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి ఎ. శ్రీదేవిలు వ్యవహరిస్తారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు అధిక సంఖ్యలో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9014063722, 8341955777 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.