BREAKING
పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్ పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గోనెగండ్ల జడ్పిటిసి బ్యాలెట్ కలకలం.. చెత్త కుప్పలో దొరికిన బ్యాలెట్లు దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’ శుభ్రమైన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లేని నగరం.. అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు!

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్

Select Suryaa Now
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఆదివారం ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ ఘనపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ... చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలియో వంటి వ్యాధుల నుంచి పిల్లలను కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఏ ఒక్క చిన్నారీ టీకాకు దూరం కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలియో నివారణ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, అంగన్‌వాడీ టీచర్ పైళ్ల మంజుల, ఆశ కార్యకర్త వేముల లత, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.