పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్
నగరం, మేజర్ న్యూస్:
మండల పరిధిలోని పెదమట్లపూడి గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా
లుక్కా గౌరీ కుమారి ఆదివారం
తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈమె భర్త లుక్కా గుడారంకయ్య గతంలో సర్పంచిగా సేవలందించారు. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడమేగాక, గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణంతోపాటు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి మంచినీటి పథకం తేవడమే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు గుడారంకయ్య చేశారు.