BREAKING
పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్ పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గోనెగండ్ల జడ్పిటిసి బ్యాలెట్ కలకలం.. చెత్త కుప్పలో దొరికిన బ్యాలెట్లు దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’ శుభ్రమైన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లేని నగరం.. అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు!

పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

Select Suryaa Now
పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలోని పరిగి, దోమ మండలాల పరిధిలో చిరుతపులి సంచారం రైతులు, గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పరిగి మండలం నస్కల్ గ్రామ సమీపంలో కృష్ణ అనే రైతు తన పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుతపులి ఎదురుపడినట్లు, తనపై దాడికి యత్నించిందని బాధితుడు తెలిపాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కృష్ణ ప్రాణభయంతో పరుగులు తీస్తూ కుప్పకూలిపోయాడు. సమీప పొలాల్లో ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఆయనను పరిగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ అక్కడ చికిత్స పొందుతున్నాడు.ఇదిలా ఉండగా, గత నెల 22వ తేదీన ఇదే ప్రాంతంలో ఓ రైతుకు చెందిన లేగదూడపై గుర్తుతెలియని జంతువు దాడి చేయడం అప్పట్లో కలకలం రేపింది. మరోవైపు దోమ మండలం దిర్సంపల్లి గ్రామ సమీపంలో గత రెండు మూడు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పశువులపై చిరుత దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పంట పొలాల్లో పనులు చేసుకోవాలంటే, మరోవైపు పశువులను మేపాలంటే చిరుత భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి చిరుత సంచారాన్ని నిర్ధారించాలని, అవసరమైన చోట బోన్లు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఏదైనా ప్రాణనష్టం జరగకముందే అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.