BREAKING
ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ పై అవగాహన వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ముఖ్య కుటుంబాలు. పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్ పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి

Select Suryaa Now
పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన బీ.ఎం. సందీప్ ని మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం వంటి అంశాల ప్రాధాన్యాన్ని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.