బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికుల భద్రత, సిబ్బంది రక్షణతో పాటు ఇంధన పొదుపునకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) మరో కీలక ఘనత సాధించింది. బీఎస్-6 బస్సుల్లో ఐ-అలర్ట్ సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టి దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ సాంకేతికత ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్‌ను ఆదా చేయగా, ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల మేర ఇంధన వ్యయం తగ్గుతోంది.
బస్సు స్టీరింగ్ డ్రైవర్ చేతిలో ఉన్నప్పటికీ, డ్రైవింగ్ విధానాన్ని ఐ-అలర్ట్ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన గేర్ ఎంపిక, గ్రీన్ బ్యాండ్ ఆర్‌పీఎం పరిధిలో డ్రైవింగ్, ఎకానమీ గేర్ల వినియోగం, ఇంజిన్‌ను అనవసరంగా ఖాళీగా నడపకుండా చూడటం వంటి అంశాలను ఈ వ్యవస్థ విశ్లేషిస్తుంది. అలాగే అతివేగం, నిర్లక్ష్యంగా బ్రేకులు వేయడం వంటి అంశాలను గుర్తించి డ్రైవర్ల పనితీరును అంచనా వేస్తుంది.
ఎ.రవీందర్, హైదరాబాద్.