ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ పై అవగాహన
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలోని ఇంకొల్లు -రైతు సేవ కేంద్రం నందు రైతులకి మండల వ్యవసాయ అధికారిణి ఎన్ మేరమ్మ ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ అని చాలా సులువుగా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చని వివరించారు. ఎరువుల కొరకు మొదటగా ఆధార్ నంబరు యాప్ నందు నమోదు చేసిన వెంటనే ఫార్మర్ ఐడి ఓపెన్ అవుతుందన్నారు. ఈ ఫార్మర్ ఐడి కలిగిన రైతు ఎరువులు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. పొలం ఉండి ఫార్మర్ ఐడి లేని రైతు వెంటనే అందుబాటులో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఏపిఎఫ్ఆర్ యాప్ నందు భూమిని నమోదు చేసుకున్నట్లయితే వెంటనే ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్ నందు తమ భూమి ఎంత కనపడుతుందని తద్వారా ఎరువులను పొందవచ్చునని తెలిపారు. పొలం లేని రైతులు గుడి మాన్యాలు మొదలగున వాటికి కూడా ఎరువులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ భూములలో ఎరువులు పొందుటకు రైతులు తమ యొక్కగ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్ నందు కాంప్లెక్స్ ఎరువులను తమకు కావలసిన అన్ని కొనుగోలు చేయవచ్చని వివరించారు. రైతులు ఎరువులను నమోదు చేసుకున్న తరువాత 48 గంటలలో పొందవచ్చన్నారు. రైతులు 48 గంటల తర్వాత రద్దు చేయబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయ అధికారి కే. వనజ మరియు రైతులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.