ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్ కుమార్ తొలిసారి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫయీమ్, నాయకులు రోహిన్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని బీఎం సందీప్ కుమార్‌కు స్వాగతం పలికారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.