డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాలు జనసేనలో చేరిక
పరిగి మండలం కాలువపల్లి గ్రామంలో జనసేన పార్టీలోకి కొత్త చేరికలు చోటుచేసుకున్నాయి. ఆదివారం హిందూపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నవీన్ నిచ్చల్ సమక్షంలో కాలువపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాల సభ్యులు జనసేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా నవీన్ నిచ్చల్ వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల ఆకర్షితులై జనసేనలో చేరినట్లు వారు తెలిపారు.కాలువపల్లి గ్రామం నుంచి ఒకేసారి 30 కుటుంబాలు పార్టీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాము విశ్వనాథ్ చంద్రశేఖర్ శివకుమార్ ముద్దు కృష్ణ జనసేన రమేష్ సురేష్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.