ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు
ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు..
8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని డాక్టర్ అంబేద్కర్ రివర్ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈహెచ్ఎస్ (EHS) మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శిబిరాన్ని ప్రారంభించగా, 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఈహెచ్ఎస్ లబ్ధిదారులు పాల్గొని ఉచిత వైద్య సేవలను పొందారు.
ఈ సందర్భంగా గుండె, లివర్, న్యూరాలజీ తదితర విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు వివిధ రకాల స్కానింగ్ సేవలను ఉచితంగా అందించారు. వైద్య పరీక్షల్లో ఎనిమిది మందికి తదుపరి చికిత్స అవసరమని గుర్తించిన వైద్యులు, వారికి ఆసుపత్రిలో ఉచిత అడ్మిషన్లు కల్పించి, ఈహెచ్ఎస్ పథకం ద్వారా అవసరమైన చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా అందుతున్న వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇకపై ప్రతి నెల రెండో ఆదివారం ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరం విజయవంతానికి సహకరించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.