BREAKING
ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ పై అవగాహన వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ముఖ్య కుటుంబాలు. పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్ పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ముఖ్య కుటుంబాలు.

Select Suryaa Now
వైసీపీకి షాక్ టీడీపీలో  చేరిన ముఖ్య కుటుంబాలు.

 కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గ్రామానికి చెందిన బోయ గేరిసే వెంకటేషులు, బోయ అశోక్ తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరిక కార్యక్రమంలో టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకుని పార్టీలోకి ఆహ్వానం అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా చేరిన వారు పేర్కొన్నారు. వైసీపీకి చెందిన ముఖ్య కుటుంబాలు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఈ చేరికలు తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని స్థానిక టీడీపీ నాయకులు భావిస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.