గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్!
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మోద గ్రామానికి చెందిన తిప్పేస్వామి గారి సాయిప్రసాద్ (32) మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆదివారం మోద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గతంలో సాయిప్రసాద్ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మరోసారి ప్రజల ముందుకు రావాలని సాయిప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈసారి వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు.సుమారు 7 వేల మంది ఓటర్లు ఉన్న మోద గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.ఒకసారి ఎదురైన ఓటమి ఆయన కుటుంబాన్ని ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గించలేదు. మరోసారి ప్రజాసేవ లక్ష్యంగా సాయిప్రసాద్ నామినేషన్ వేయడంతో మోద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ ఆసక్తికరంగా మారింది.