BREAKING
ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు

మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

Select Suryaa Now
మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: ప్రభుత్వ భూములను వేలం వేసి విక్రయించకుండా ప్రజా అవసరాలకు, ముఖ్యంగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ, నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్‌ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన దర్నా కార్యక్రమంలో అంజి, అనంతయ్య, రాజేందర్, నరేష్ గౌడ్, శివ ముదిరాజ్, అల్లం యాదయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ మియాపూర్‌లోని 850 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు, విద్యాసంస్థల నిర్మాణానికి కేటాయించాలని కోరారు. అదనంగా 150 బీసీ కాలేజీ హాస్టళ్లు, 100 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల విక్రయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్క్ వద్ద సోషలిస్టు విద్యార్థి సంఘం మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని ప్రజా సంక్షేమం, విద్య, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు వినియోగించాలే తప్ప విక్రయించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 325 హాస్టళ్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఒక్క హాస్టల్‌కు కూడా సొంత భవనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. హాస్టళ్లు ప్రారంభమై 27 ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలు నిర్మించకపోవడం బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా 320 బీసీ గురుకులాలు, 50 ఎస్సీ గురుకులాలకు కూడా సొంత భవనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వాలు బీసీ హాస్టళ్లు, గురుకులాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లైఓవర్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్న పాలకులకు ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థుల కోసం సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచన ఎందుకు రావడం లేదని నిలదీశారు. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఐదుగురు ఉండాల్సిన గదుల్లో 20 నుంచి 30 మంది వరకు ఉంటున్నారని, కొన్ని చోట్ల ఒకే భవనంలో మూడు గురుకులాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేక విద్యార్థుల ఆరోగ్యం, చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అద్దెల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తాన్ని సొంత భవనాల నిర్మాణానికి వినియోగిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ భూములను హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల నిర్మాణానికి కేటాయిస్తే భవన నిర్మాణ వ్యయంలో 80 శాతం వరకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు పొందే అవకాశం ఉందని తెలిపారు. బహుళజాతి సంస్థల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు సమీకరించి భవనాలు నిర్మించేందుకు ఎంపీలు కూడా కృషి చేస్తారని చెప్పారు.
ప్రభుత్వ భూములు భావితరాలకు తరగని ఆస్తి అని, వాటిని అమ్మేస్తే భవిష్యత్ తరాలకు ఏమి మిగులుతుందని ప్రశ్నించారు. గతంలోనూ ప్రభుత్వ భూముల విక్రయ ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నామని, ఇప్పుడు కూడా భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను వినియోగించాలని కోరారు.
కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బస్సు పాస్‌లు, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం బాలికలకు నెలకు రూ.1,000, బాలురకు రూ.800 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలి. హాస్టళ్లలో అదనంగా ఇద్దరు వర్కర్లను నియమించాలి. 100 మందికి పైగా విద్యార్థులున్న హాస్టళ్లలో ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక వర్కర్ చొప్పున అదనంగా నియమించాలి. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలి. ఫీజుల గరిష్ఠ పరిమితిని ఎత్తివేసి గతంలో మాదిరిగా పూర్తి ఫీజులు చెల్లించాలి. అదనంగా 150 బీసీ కాలేజీ హాస్టళ్లు, 240 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి. బీసీలకు 100 గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.