BREAKING
ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్. నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్ కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా*

కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు

Select Suryaa Now
కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు

సూర్య - మానకొండూర్ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుండగా, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం కరీంనగర్‌లో నిర్వహించనున్న 'మహా పాదయాత్ర'ను చారిత్రాత్మక విజయం చేయాలని బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం మానకొండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంది రాజిరెడ్డి మాట్లాడుతూ.. "భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు  నితిన్ నబిన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహా పాదయాత్రకు కరీంనగర్ వేదిక కావడం మనందరికీ గర్వకారణం. సోమవారం జరగనున్న ఈ బృహత్తర కార్యక్రమానికి మానకొండూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అభిమానులు కదం తొక్కాలి" అని కోరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. "దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీ బలోపేతానికి, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. మండలంలోని శ్రేణులందరూ ఐక్యంగా కదిలి, పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చి ఈ మహా పాదయాత్రను విజయవంతం చేసి మన సత్తా చాటాలిని" అని కంది రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.