BREAKING
రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి

తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య.

Select Suryaa Now
తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య.

శెట్టూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శెట్టూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తనూజకు మద్దతుగా మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని వివిధ వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తనూజను గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని తనూజ విజయానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ ప్రజల ఆదరణతో సర్పంచ్ అభ్యర్థి తనూజ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని తలారి రంగయ్య వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.