అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
అభివృద్ధి కోసమే కూటమికి పట్టం కట్టిన ప్రజలు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;రాష్ట్రంలో సాఫీగా అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం నగరాల నుండి గ్రామ స్థాయి వరకు అన్ని పదవులలో అధికారంలో ఉండాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం మరోమారు ప్రభంజనం సృష్టించిందని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు మరో మారు కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ లను భారీ సంఖ్యలో కైవసం చేసుకోవడం జరిగిందన్నారు.
సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు.
అదే తమ కూటమి ప్రభుత్వంలో అలా జరగదని ఏకగ్రీవమైన అన్ని గ్రామాలకు ఏదైతే హామీ ఇచ్చామో అది తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నారని తెలిపారు.
ప్రజలు కూడా ఏ నాయకుడు ఉంటే తమ పనులు జరుగుతాయని ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ పట్టణంలో రెండు పార్కులను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ వివరించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా