BREAKING
ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్. నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్ కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా*

నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్.

Select Suryaa Now
నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్.

**కంబదూరు:** పోలీసులమంటూ నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ క్యాపులు ధరించి వాహనదారులను బెదిరిస్తూ నగదు దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కంబదూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ పోలీస్ ఐడీ కార్డు, కత్తి, రెండు పోలీస్ క్యాపులు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌తో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా పరిధిలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్ (24), జె. అలీ అబ్బాస్ (27) ఇద్దరూ కలిసి నకిలీ పోలీసులుగా అవతారమెత్తి దోపిడీలకు పాల్పడుతున్నారు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులు, పోలీస్ క్యాపులు ధరించి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఒంటరిగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవారు. మార్గమధ్యంలో వారిని అడ్డగించి తాము పోలీసులమని పరిచయం చేసుకునేవారు. అనంతరం బాధితుల వద్ద గంజాయి లేదా నకిలీ నోట్లు ఉన్నాయంటూ భయపెట్టి, తనిఖీల పేరుతో నగదును వసూలు చేసేవారు. ఎదురు తిరిగిన వారిని కత్తితో బెదిరించి డబ్బులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ క్రమంలో నవంబర్ 21వ తేదీ ఉదయం సుమారు 11 గంటల సమయంలో కల్యాణదుర్గం–నూతిమడుగు ప్రధాన రహదారిలోని వై.సి.పల్లి సమీపంలో ఓ వృద్ధుడిని నిందితులు అడ్డుకున్నారు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డును చూపించి, అతని వద్ద తనిఖీలు చేస్తున్నట్లు నమ్మించారు. అనంతరం కత్తితో బెదిరించి బాధితుడి వద్ద ఉన్న రూ.5,500 నగదును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంబదూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 102/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 319(2), 308(5) రెడ్‌విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో నూతిమడుగు గ్రామ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వై.సి.పల్లి వద్ద వృద్ధుడి నుంచి నగదు దోచుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. మరింత లోతుగా విచారించగా బెలుగుప్ప, యాడికి పోలీస్ స్టేషన్ పరిధుల్లోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసుల్లోనూ వీరికి సంబంధం ఉన్నట్లు, కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన మరో నేరంలో కూడా తమ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5,500 నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డు, రెండు పోలీస్ జంగిల్ క్యాపులు, ఒక చిన్న కత్తి, హోండా ఎస్‌పీ షైన్ ద్విచక్ర వాహనం, ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు. **ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:** పోలీసులమని చెప్పుకుంటూ అపరిచిత వ్యక్తులు వాహనాలను ఆపినా, గుర్తింపు కార్డులు చూపించినా వారి అధికారిక గుర్తింపును నిర్ధారించుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. అపరిచితుల బెదిరింపులకు భయపడి నగదు ఇవ్వవద్దని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.