BREAKING
మీనాక్షి నటరాజన్ సేవలు మరువలేని: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2047 నాటికి 26.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కళ్యాణదుర్గంలో బోల్తా పడిన ఆటో... తృతిలో తప్పిన పెను ప్రమాదం. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తొలి అధికారిక పర్యటన ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్. నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్ కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్

ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

Select Suryaa Now
ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో  జిల్లా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు కొండంత అండగా నిలిచేందుకు ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డికి ఉపముఖ్యమంత్రి, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లో (జోన్-5) ఇరిగెల రాంపుల్లారెడ్డిని సభ్యుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షణలో పనిచేసే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నంద్యాల సహా రాయలసీమ జిల్లాల్లోని అభ్యర్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నారు. జోన్-5 (నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు) పరిధిలో ఇరిగెల రాంపుల్లారెడ్డితో పాటు నవీన్ నిశ్చల్, టి.సి. వరుణ్, రేఖా గౌడ్‌లు సభ్యులుగా పనిచేయనున్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి  మేజర్ న్యూస్ తోమాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, రామ్ తాళ్లూరి ఇతర పార్టీ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ, నంద్యాల జిల్లా జనసేన శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా