పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:*
శాలిగౌరారం సూర్య న్యూస్:
*వేముల గోపీనాథ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుంగతుర్తి నియోజకవర్గం*
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ తెలిపారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించే నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు గారి సహకారంతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువకావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగడం అభినందనీయమని తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన పెంచుకుని, అర్హత కలిగిన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు గారికి, ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.