*పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : ప్రశాంతి రెడ్డి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు
కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, ఇతర మత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ఆశీర్వదించారు. వీపీఆర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మత పెద్దలు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు.