ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నిర్మల హృదయ భవన్‌లో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన టీడీపీ నాయకులు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి - రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ
కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని బీవీ నగర్‌లో ఉన్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన నిర్మల హృదయ భవన్ వృద్ధాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం అక్కడి వృద్ధులకు విందు ఏర్పాటు చేశారు. అలాగే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.