BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త: 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన' కింద రూ. 6,000 వరకు ఆర్థిక సాయం.. అర్హతలు, ప్రయోజనాల పూర్తి వివరాలు వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి గట్టుదుద్దెనపల్లి సొసైటీలో రూ.లక్షలు హాంఫట్..? - పైపు లీకేజీ పేరిట బంకులో రూ.52 లక్షలు స్వాహా? వేమవరంలో స్వతంత్ర అభ్యర్థి రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం సారస్వత నికేతనం సందర్శించిన ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ - అరుదైన గ్రంథాలు, తాళపత్రాలు, చారిత్రక సంపద పరిశీలన కళ్యాణదుర్గం మండలం బట్వానిపల్లి గ్రామంలో మేతకు వెళ్లిన గొర్రెలు మేకలు మృతి. కూటమి ప్రభుత్వంలో ప్రగతి పథంలో పల్లెలు : టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిఠాపురం మున్సిపాలిటీలో భగ్గుమన్న జనసేన అసమ్మతి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నగరం మండలంలో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం

డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

Select Suryaa Now
డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'నషా ముక్త్ భారత్' ఉద్యమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ అయి, 'నషా ముక్త్ భారత్' యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రభాస్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టి, యువతను చైతన్యపరచడంలో సినీ ప్రముఖుల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కోట్లాది మంది యువత అభిమానించే ప్రభాస్ వంటి అగ్ర నటుడు ఈ ఉద్యమంతో కలిసి రావడం వల్ల సమాజంలో మరింత బలమైన అవగాహన కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను, ప్రత్యేక టీ-షర్టులను వీరిద్దరూ కలిసి ఆవిష్కరించారు.