బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు
సూర్య - మానకొండూర్ : కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన మహా పాదయాత్రకు మద్దతుగా మానకొండూరు మండలం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండల అధ్యక్షులు కందిరాజు రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్రకు బయలుదేరారు.ఈ సందర్భంగా మానకొండూరు మండల కేంద్రంలో పాదయాత్రకు వెళ్తున్న బస్సులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ఎస్ఐఆర్పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో బండి సంజయ్ కుమార్ ఈ మహా పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉత్సాహంగా తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, దూలం కిరణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, శీలం కుమార్ యాదవ్, మీసా రమణయ్య, వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.