BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు

జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

Select Suryaa Now
జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

జాతీయస్థాయిలో నిర్వహించిన వైద్య విద్యార్థుల క్రీడా పోటీల్లో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి వాలీబాల్ పోటీల్లో తృతీయ స్థానం సాధించడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీవాణి పేర్కొన్నారు.

నవంబర్ 19 నుంచి 24 వరకు మహారాష్ట్రలోని ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో నిర్వహిస్తున్న *ASP ERA–2026* క్రీడా పోటీల్లో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల వాలీబాల్ జట్టు పాల్గొని మూడో బహుమతిని కైవసం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి అభినందించారు. వైద్య విద్యలో రాణించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటడం కళాశాలకు గర్వకారణమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమష్టి కృషి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

వాలీబాల్ జట్టు విజయానికి కృషి చేసిన విద్యార్థులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ బి. రాధాకృష్ణయ్యను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ విజయాన్ని సాధించిన జట్టులో ఎన్. గోపీచంద్ నాయక్, ఎం. హరిప్రసాద్ చారి, కె. రామ్ ప్రసాద్ రెడ్డి, జి. నందకుమార్, జె. రవితేజ, బి. గణేష్, ఎం. జయవర్ధన్ కుమార్, జి. కిరణ్, ఎం. సాత్విక్, కె. అడ్డా వరగణేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. చంద్రకళ, డాక్టర్ ఎస్. మస్తాన్ ఖాదర్, ఫిజికల్ డైరెక్టర్ బి. రాధాకృష్ణయ్య విద్యార్థుల ప్రతిభను అభినందించారు.