BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి

Select Suryaa Now
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి

రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ తాహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సీనియర్ అసిస్టెంట్ కరిముల్లా,లకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వారధులుగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మండలంలోని ప్రజల సమస్యలను నిరంతరం వార్తల రూపంలో ప్రచురిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ప్రభుత్వ భూమి కేటాయించి, హద్దులు ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని నిజాంపేట మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చంద్రకాంత్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్, ఏపీఎం అశోక్, ఎసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి, సిఆర్పి రాజు,ఎక్సైజ్ అధికారి, తదితరులు ఉన్నారు.