BREAKING
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం

Select Suryaa Now
కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం

కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం

* ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం

* మేయర్ గా మన్నెం శ్రీనివాస ప్రసాద్@ జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా పాలడుగు విజయ ప్రమాణం

తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్:
తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా కొలువుదీరింది. మేయర్ గా మన్నెం శ్రీనివాస ప్రసాద్@ జేబీ శ్రీనివాస్ గెలుపొందిన తరువాత గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టౌన్ క్లబ్ కూడలి లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత బాలాజీ కాలనీ కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి భారీ జనసంద్రోహం నడుమ ఊరేగింపు గా శ్రీనివాస ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.

మేయర్ ప్రమాణస్వీకారం తో హోరెత్తిన ఆడిటోరియం
---------
నగరంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో మేయర్ గా మన్నెం శ్రీనివాస ప్రసాద్@ జేబీ శ్రీనివాస్ చేత జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రమాణం చేయించారు. ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న అంతసమయం ఆడిటోరియం మొత్తం అభిమానులు కేరింతలతో ఆడిటోరియం హోరెత్తింది. అనంతరం 66 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

డిప్యూటీ మేయర్ ఎన్నిక..
--------
అనంతరం ఎస్వీయూ సెనేట్ హాల్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో  
35వ డివిజన్ నుండి ఎంపికైన జనసేన అభ్యర్థిని పాలడుగు విజయ పేరును డిప్యూటీ మేయర్ గా జనసేనకు చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ డి.నీతా పటేల్ ప్రతిపాదించగా, అదే పార్టీకి చెందిన 10వ వార్డు కార్పొరేటర్ పురిమిట్ల రాణి బలపరిచారు. డిప్యూటీ మేయర్ పదవికి ప్రతిపాదిత అభ్యర్థి పాలడుగు విజయను 62 మంది కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (ఎక్స్ అఫీసీయో) సభ్యులతో కలిపి మొత్తం 63 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో కలెక్టర్ డిప్యూటీ మేయర్ గా ప్రమాణం చేయించారు. 
ఈ కార్యక్రమం లో తిరుపతి, చంద్రగిరి ఎం ఎల్ ఏ లు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర గ్రీనరీ  బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర హస్తకళాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భావుప్రకాష్ రెడ్డి, ఎస్విబిసి ఛైర్మన్ శ్రీధర్ వర్మ, తాతయ్య గుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ యు. శారదాదేవి, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ జేబీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు... అత్యధిక మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను. 100 రోజుల ప్రణాళికతో అభివృద్థిని చేసి చూపిస్తాను. తిరుపతిని అభివృద్థిని చూసి మిగతా నగరాలు మారేలా చేస్తాను. తిరుపతిని మరింత అభివృద్థి చేయాలని లోకేష్ ఆదేశించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాను. త్వరలో యూడీసీ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు,


Raaju బ్యూరో, తిరుపతి జిల్లా