నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం
తూప్రాన్;మెదక్ జిల్లా తూప్రాన్ లో నూతనంగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి - కమ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభోత్సవం మంగళవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, మెదక్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుద్దాల చలపతి రావు లచే ప్రారంభించనున్నట్లు జిల్లా డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి నీలిమ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ పాల్గొననున్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి జి. నీలిమ, మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కె. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మేనేజర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.