BREAKING
శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

Select Suryaa Now
ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య  : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

గుంటూరు, మేజర్‌న్యూస్‌ :

సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ గొడవల్లోకి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని లాగడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మాట్లాడిన ఆయన.. మహిళా సంక్షేమం, మహిళా గౌరవం అంటే జగన్ దృష్టిలో మాటలకే పరిమితమని ఈ ఘటనతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఆడబిడ్డల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లి రోడ్డున పడేసి వారు బాధపడుతుంటే చూస్తూ ఆనందించడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు.

కుటుంబ విభేదాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం జగన్ రెడ్డికి అలవాటే
“నిజానికి షర్మిల విషయం వారి కుటుంబ అంతర్గత వ్యవహారమని ఇంతకాలం సంయమనం పాటించాం. కానీ, ప్రతిసారీ మీ ఇంటి సమస్యలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? గతంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా, చంద్రబాబు నాయుడు గారే చేయించారంటూ 'నారాసుర రక్తచరిత్ర' అని విషప్రచారం చేశారు. ఇప్పుడు షర్మిల గారు మర్యాదపూర్వకంగా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే, దానిపై కూడా వైసీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలతో లేనిపోని ఆరోపణలు చేయిస్తూ దుమారం రేపుతున్నారు. గతంలో "పసుపు చీర కట్టుకొచ్చారు.. వీరంతా కుట్రలో భాగస్వాములై మా ఆస్తులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు" అంటూ దిగజారుడు ప్రచారం చేశారు. అసలు మీ ఇంటి గొడవలకు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? రాజకీయ పరిణతి లేకపోవడం వల్ల, మీ సొంత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం చేతగాక, ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారిపైనా, తెలుగుదేశం పార్టీ నేతలపైనా బురద జల్లడం మీకు అలవాటుగా మారింది. ఇకనైనా మీ కుటుంబ విభేదాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానుకుని, మీ ఇంటి సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి” అని పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు.

ధనదాహం తప్పు మానవీయ విలువలు లేని వ్యక్తి జగన్
“ఏ ఇంట్లోనైనా కుటుంబ సమస్యలు ఉండటం సహజం. కానీ, ఆ సమస్యలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవడం చేతగాక, కేవలం ఆస్తిపై స్వార్థంతో కన్నతల్లిని, తోబుట్టువును బయటకు నెట్టివేసి, ఆ నిందను తెలుగుదేశం పార్టీపై వేయడం ఎంతవరకు సరైనది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఇంకెంతకాలం రాజకీయాల్లో బతుకుతారు. రాజకీయాల్లో కేవలం మాటలు చెప్తూ బతకడం కాదు జగన్ మోహన్ రెడ్డి! ముందు మీ ఇంటి సమస్యలను పరిష్కరించుకుని, ఆ తర్వాత రాష్ట్రంలోని మహిళా సోదరీమణులను ఉద్ధరిస్తామని మాట్లాడండి. ఇంట్లో ఉన్న సొంత తల్లికి, చెల్లికే న్యాయం చేయలేని మీరు, రాష్ట్ర ప్రజలకు, మహిళలకు న్యాయం చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా గ్రహించాలి. జగన్ మోహన్ రెడ్డికి కేవలం ధనదాహం తప్ప, తన చుట్టూ ఉన్న ఏ ఒక్కరిపైనా ప్రేమ కానీ, బాధ్యత కానీ ఉండవని మరోసారి స్పష్టమైంది.” అని పేర్కొన్నారు.

తల్లి, చెల్లి బాధపడుతుంటే చూస్తూ ఆనందించడం సిగ్గుగా లేదా జగన్?
“కేవలం పార్టీ అధికారం తన చేతిలోనే ఉండాలనే స్వార్థంతో సొంత తల్లితో రాజీనామా చేయించి, చెల్లిని పార్టీకి దూరం పెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని మరోసారి రుజువైంది. వేదికలపై మహిళా సాధికారత అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్, వాస్తవానికి తన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలనే రోడ్డున పడేశారు. ఏ ఇంట్లోనైనా ఆస్తుల వివాదాలు, విభేదాలు ఉండటం సహజం. కానీ, మేనకోడలి పెళ్లి జరుగుతున్న శుభసందర్భంలో ఒక మేనమామగా విభేదాలను పక్కన పెట్టి, పెళ్లి పనులకు సహకరించడం మన సంప్రదాయం. అలా చేయకపోగా, కన్నతల్లిని, చెల్లిని రోడ్డు మీద కూర్చోబెట్టి, వారు పడుతున్న బాధలను సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఆనందించడం పైశాచిక ఆనందం కాక మరేమిటి? గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినప్పుడు కూడా ఇలాగే వీడియోలు చూసి ఆనందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల బాధను సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌లలో చూసి ఆనందించడం ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు.”

“రాష్ట్రానికి ద్రోహం చేయాలనే ఆలోచనతో జగన్, ఆయన అనుచరులు నేషనల్ మీడియా వేదికగా అమరావతిలో పచ్చదనం (గ్రీన్ కవర్) నాశనమవుతోందంటూ విషప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు అమరావతిపై పడ్డారు, రేపు విశాఖపట్నం అభివృద్ధికి కూడా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి కుట్రలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటే, ముందు తన ఇంట్లో తల్లికి, చెల్లికి న్యాయం చేసి, ఆ తర్వాత రాష్ట్రంలోని మహిళల గురించి మాట్లాడాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికీ ఇలాగే అసత్య ఆరోపణలతో బతకాలని చూస్తే, రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం.” అని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.