ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం
దేవనకొండ వైసిపి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎర్రగోటి అంజి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు.వైకాపా నాయకులు,కార్యకర్తలతో కలిసికట్టుగా గ్రామంలో తిరుగుతూ తమ గుర్తు క్యారెట్ పై మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.సోమవారం ఎస్సీ కాలనీతో పాటు పలు విధులలో తిరుగుతూ క్యారెట్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.ఈ సందర్భంగా దేవనకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎర్రగోటి అంజి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా బరిలో నిలిచానాని తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి క్యారెట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానని హామీ ఇచ్చారు.ఈ నెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పోలింగ్‌లో గ్రామ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును క్యారెట్ గుర్తుపై వేసి తనను ఆశీర్వదించాలని ఎర్రగోటి అంజి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కిట్టు మరియు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.