BREAKING
పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!! *మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!* అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....… అక్రిడియేషన్ విలేకరులకే అనుమతిపై బి ఎస్ ఎస్ అభ్యంతరం

నిర్దేశించిన పరిమితి దాటి సముద్రంలోకి వెళ్లకూడదు.. ప్రమాదకరం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

Select Suryaa Now
నిర్దేశించిన పరిమితి దాటి సముద్రంలోకి వెళ్లకూడదు.. ప్రమాదకరం  జిల్లా ఎస్పీ  బి. ఉమామహేశ్వర్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు స్థానిక భక్తులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. పోలీస్ శాఖ సూచనలు, హెచ్చరికలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా సముద్ర స్నానాలు ఆచరించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రధాన సముద్ర తీర ప్రాంతాలైన సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు బాపట్ల జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మొత్తం సుమారు 430 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సూర్యలంక బీచ్ వద్ద బాపట్ల డీఎస్పీ సీహెచ్. చంద్రమౌళి ఆధ్వర్యంలో 5 గురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 260 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వాడరేవు, రామాపురం బీచ్‌లతో పాటు పొట్టి సుబ్బయ్యపాలెం, మోటుపల్లి ప్రాంతాల్లో చీరాల డీఎస్పీ  ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో 4 గురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 166 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించామన్నారు. వీటితో పాటు జిల్లాలోని దేవాలయాలు, నదీ తీర ప్రాంతాల్లో కూడా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సముద్ర తీర ప్రాంతాల్లో లైఫ్ జాకెట్లు, రోప్‌లతో సిద్ధంగా ఉండే సివిల్, మెరైన్ పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. సముద్రంలో ప్రమాదకరమైన లోతులోకి వెళ్లకుండా ముందస్తు హెచ్చరికగా ఎరుపు రంగు జెండాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఆ జెండాలను దాటి సముద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా పోలీస్ సిబ్బంది హెచ్చరిస్తూ భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల ద్వారా సముద్ర తీర ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, సముద్రంలో నిర్దేశిత ప్రాంతాల్లో పడవల ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారన్నారు.

భక్తులు తమ పిల్లలను కూడా పుణ్యస్నానాల కోసం తీసుకువచ్చే సమయంలో వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలను ఒంటరిగా నీటిలోకి వెళ్లనివ్వకూడదని ఎస్పీ గారు సూచించారు. ఎవరైనా భక్తులు అనుకోకుండా ప్రమాదానికి గురైనా, ఏవైనా సమస్యలు ఎదురైనా వారిని తక్షణమే రక్షించి భద్రత కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. పోలీస్ శాఖ సూచించే సూచనలు, హెచ్చరికలు ప్రజల రక్షణ, భద్రత కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించి వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. సముద్రపు అలల ఉధృతి, ఆటుపోట్లను గమనిస్తూ, పోలీస్ శాఖ సూచించిన పరిమితుల్లోనే సముద్ర స్నానాలు ఆచరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించిన లోతు దాటి సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు. భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా, ఆహ్లాదకరంగా పుణ్యస్నానాలు ఆచరించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ గారు కోరారు.

ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని లేదా అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228కు సమాచారం అందించాలని ఎస్పీ గారు సూచించారు.