అక్రిడియేషన్ విలేకరులకే అనుమతిపై బి ఎస్ ఎస్ అభ్యంతరం
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి* ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్రిడియేషన్ కలిగిన పాత్రికేయులకు మాత్రమే అనుమతి కల్పించాలన్న మున్సిపల్ కమిషనర్ గంగారెడ్డి నిర్ణయాన్ని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర ఖండించారు. అక్రిడియేషన్ లేని చిన్న పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులను వార్తా సేకరణకు అనుమతించకపోవడం పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొన్నారు.ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బహిరంగ కార్యక్రమమని, మీడియా ప్రతినిధులందరికీ సమానంగా కవరేజ్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. హాల్‌లో స్థలం సరిపోకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగితే పాత్రికేయులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
*A. R శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*