BREAKING
పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!! *మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!* అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....… అక్రిడియేషన్ విలేకరులకే అనుమతిపై బి ఎస్ ఎస్ అభ్యంతరం

ప్రెస్ మీట్ లకే పరిమితమైన విజిటర్ ఎమ్మెల్యే.

Select Suryaa Now
ప్రెస్ మీట్ లకే పరిమితమైన విజిటర్ ఎమ్మెల్యే.

కూటమి అభ్యర్థుల విజయం దర్శి ప్రగతికి సోపానం.

ప్రెస్ మీట్ లకే పరిమితమైన విజిటర్ ఎమ్మెల్యే.

రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి వైపు నిలబడిన ప్రజలు.

కూటమి అభ్యర్థులు గెలిస్తే నేను గెలిచినట్లే.

ప్రజల ఆకాంక్షలతో అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి. కూటమి అభ్యర్థుల విజయం దరిశి అభివృద్ధికి సోపానమని మరింత రెట్టింపు ఉత్సవంతో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా నూతన పాలకవర్గం పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. 
దర్శి పట్టణం లోని పొదిలి రోడ్ లోని పి.జి.యన్. కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన దర్శి పురపాలక సంఘం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ , కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ సభ  కార్యక్రమం లో ముఖ్య అతిధిగా  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారాపుశెట్టి పాపారావు పాల్గొన్నారు.
మూడేళ్ల ప్రజా ప్రభుత్వంలో  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు  నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కృషి ఫలితమే నేడు ఎన్నికలలో ప్రజలందరూ కూటమి వైపు నిలబడ్డారు.  అందుకే ఏకపక్షంగా ఏకగ్రీవంగా దర్శి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి పార్టీలు టిడిపి-జనసేన-బిజెపి మద్దతుతో మున్సిపల్ చైర్మన్  దారం సుబ్బారావు  ఎన్నికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు . ఆనాడు ప్రజలు నన్ను ఓడించిన.. మీరు గెలిస్తే నేను గెలిచినట్టేనని ప్రజలకు నేను చెప్పిన మాట నిజం చేశారు ప్రజలు మాట నిలబెట్టుకున్నారనీ అన్నారు.దారం సుబ్బారావు  ఎన్నిక ప్రజా విజయంగా కూటమి ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు.  దారం సుబ్బారావు  పెద్దలు  నారపుశెట్టి పిచ్చయ్య  గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి ఉన్నారు ఆయన అనుభవాలను తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దర్శిలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అరాచకం పోయింది అభివృద్ధి వచ్చింది.  ఇది చూసి ఓర్వలేని వైసిపి నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  అప్పుడప్పుడు విజిటర్ గా వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి నిందారోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.  మీరు చేసే పనులు ఎదుటి వారిపై రుద్దుతున్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎస్సై పై దాడి చేసింది ఎవరు?  వెంకటాచలం పల్లి లో కారం చల్లింది ఎవరు? దాడులకు దిగింది ఎవరు? ప్రజలు గ్రామాభివృద్ధికి ఏకగ్రీవాలు చేసుకుంటే ఉనికి కోల్పోతామని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి మీది మాది అభివృద్ధి ప్రభుత్వం.  అభివృద్దే మా ఎజెండా. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమిటో మీరు చూస్తున్నారు.  మీరు మూడుసార్లు మీ కుటుంబంలో ఎమ్మెల్యేగా గెలిచి దర్శికి ఏం చేశారని సవాల్ విసిరుతున్నాను. మేము వచ్చాక చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు డిగ్రీ కాలేజీ నిర్మాణం, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తిరిగి పనులు ప్రారంభం, రైతు బజార్ ఏర్పాటు, 100 కోట్లకు పైగా వేయంతో ఇంటింటికి కుళాయిల నిర్మాణం, 20 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఇలా అభివృద్ధి ఎజెండాగా మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మీరు లోకల్ అన్నారు మీరు లోకల్ లో ఉండరు బెంగళూరు, హైదరాబాదులో ఉంటూ చీమకుర్తిలో ప్రచారాలు చేస్తూ దర్శిలో ప్రజలను రెచ్చగొట్టే సంస్కృతి మీది.


నేను దర్శి లో ఎన్ని రోజులు ఉన్నాను మీరు ఎన్ని రోజులు ఉన్నారు. మీరు వారానికి ఎన్ని రోజులు వస్తున్నారు  ప్రజలందరూ చూస్తున్నారు.   ఇప్పటికైనా నేను సవాలు విసురుతున్నాను దర్శిలో సంవత్సరంలో ఎవరు ఎక్కువ రోజులు ప్రజలతో ఉంటారు ప్రజల సమస్యలు తీరుస్తారో తెలుసుకుందాం చూద్దాం.  ఇప్పుడు నుంచి లెక్కలు వేసుకోమనండి ఆ లెక్కలేదో చెప్పండి అంతేగాని మీరు చేసే అరాచకాలు మా కూటమినేతలపై, కార్యకర్తలపై బురద  చల్లదని డాక్టర్ లక్ష్మి సూచించారు..
ఈ కార్యక్రమం లో దర్శి నియోజకవర్గం లోని మండల టిడిపి, బీజేపి, జనసేన పార్టీల అధ్యక్షులు, నూతన ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు, మహిళాలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.