శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు
సిద్దిపేట అర్బన్;సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌లో గల శ్రీవాణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులుగా వివిధ బాధ్యతలను స్వీకరించి, తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎ. వైష్ణవి డీఈఓగా, బి. నవీన కరస్పాండెంట్‌గా, ఆర్. హాసిని ప్రిన్సిపాల్‌గా, పీఈటీ భార్గవి, రేవంత్ తదితరుల పాత్రలను విద్యార్థులు పోషించారు. అలాగే లాస్యశ్రీ, హర్షిత, నివేదిత్, నిహాల్, ఫణీంద్రనందన్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల నిర్వహణలోని వివిధ బాధ్యతలను స్వయంగా చేపట్టి, ఉపాధ్యాయుల విధులు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సీహెచ్ సత్యం మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక నాయకుడు దాగి ఉంటాడని, వారిలోని అంతర్గత ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.సేవాభావం, క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులు తమలోని సామర్థ్యాన్ని గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఆచరణాత్మక అనుభవం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.