BREAKING
డీఆర్డీఓ అధికారి నర్సింగ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కొలువు దీరిన ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యవర్గం... హుస్నాబాద్‌లో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల తనిఖీలు – కేసు నమోదు నిర్దేశించిన పరిమితి దాటి సముద్రంలోకి వెళ్లకూడదు.. ప్రమాదకరం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ 25న సిద్దిపేటలో మహా పాదయాత్ర మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏళ్లు మారినా.. కదలని కుర్చీలు!? సిద్దేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక మహోత్సవం హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలో కొండ గుహల్లో కొలువు దీరిన శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయ ప్రంగణంలో సోమవారం సాయంత్రం కార్తీక మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. జంగమర హోసహళ్లి మఠం కు చెందిన ఆజాత శంభులింగ శివచార్యు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ క్విజ్ పోటీలలో రెండు విభాగాలలోనూ మాంటిస్సోరి విద్యార్థులకు ప్రథమ బహుమతులు ప్రెస్ మీట్ లకే పరిమితమైన విజిటర్ ఎమ్మెల్యే. శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం

హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.…

Select Suryaa Now
హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.…

దుబ్బాక ;హైదరాబాద్‌లో నవంబర్ 22న నిర్వహించిన 12వ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 జాతీయ స్థాయి పోటీల్లో  దుబ్బాక ప్రాంతాలకు చెందిన 12 మంది విద్యార్థులు పాల్గొని 12 పతకాలు సాధించి ప్రతిభ చాటారు. సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో దుబ్బాక విద్యార్థులు విద్యార్థులు నాలుగు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించడం విశేషం మాస్టర్ మైండ్ స్కూల్, సిద్దిపేటకు చెందిన అనన్య, సుప్రతిక్ గోల్డ్ మెడల్స్ సాధించగా, శ్రీతన్ సిల్వర్ మెడల్, షేరష్ట, అవనేశ్, బాలయోగేందర్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన విశ్రుద్ గోల్డ్ మెడల్, ప్రజ్వలిత్ సిల్వర్ మెడల్ సాధించారు. మెరిడియన్ స్కూల్‌కు చెందిన దివాన్ష్ బ్రాంజ్ మెడల్ సాధించారు. దుబ్బాక రజనీకాంత్ రెడ్డి స్కూల్‌కు చెందిన శ్రీహర్ష గోల్డ్ మెడల్, జోష్నిక సిల్వర్ మెడల్ సాధించగా, దుబ్బాక గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన పల్లవి సిల్వర్ మెడల్ సాధించారు.ఈ సందర్భంగా యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీల్లో సిద్దిపేట, దుబ్బాక విద్యార్థులు 12 పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్థుల్లో కరాటే శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.విజేతలను మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ రాణి మాల్విక, పీఈటీ రాజిరెడ్డి, గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు భూపాల్, పీడీ సౌందర్యతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.అలాగే ఆర్ఎస్ఎస్ కాయ్ వ్యవస్థాపకులు మాస్టర్ నాగేష్, ఆర్ఎస్ఎస్ కాయ్ జనరల్ సెక్రటరీ నవీన్, బాబురావు, ప్రసాద్ గౌడ్, సుబ్బు షోటోకాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు సురేందర్ విద్యార్థుల విజయాలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ విజయానికి విద్యార్థుల కృషి, కరాటే మాస్టర్ శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలల సహకారం ఎంతగానో దోహదపడ్డాయని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం స్థానికంగా ఆనందం, గర్వకారణంగా నిలిచిందన్నారు.