BREAKING
పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!! *మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!* అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....… అక్రిడియేషన్ విలేకరులకే అనుమతిపై బి ఎస్ ఎస్ అభ్యంతరం

కొలువు దీరిన ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యవర్గం...

Select Suryaa Now
కొలువు దీరిన ముమ్మిడివరం నగర పంచాయతీ  కార్యవర్గం...

కొలువు దీరిన ముమ్మిడివరం నగర పంచాయతీ  కార్యవర్గం...
చైర్ పర్సన్ గా  గుబ్బల గంగా రత్న భవాని...,                                    వైస్ చైర్ పర్సన్ గా ములపర్తి దుర్గా మహేశ్వరి ప్రమాణం... ముమ్మిడివరం  మేజర్ న్యూస్ నగర పంచాయతీ నూతన కార్యవర్గం సోమవారం కొలువు దీరింది. చైర్ పర్సన్ గా గుబ్బల గంగా రత్న భవాని తొలుత ప్రమాణ స్వీకారం చేయగా... అనంతరం 23 వార్డు కౌన్సిలర్లు చేత ఎన్నికల ప్రత్యేక అధికారి, డ్వామా పిడి  జి ఎస్ రామ్ గోపాల్  అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, శాసనమండలి మాజీ డిప్యూటీ  చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, రెడ్డి అనంత కుమారి, దాట్ల పృద్వి, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, కట్టా సత్తిబాబు, దాట్ల బాబు, ఆర్ఎస్ఎస్ మూర్తి,  గుబ్బల రవి, ఐ పోలవరం ఎంపీపీ  గణేష్,  ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో పాటు, నగర పంచాయతీ అధికారులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. 
వైస్ చైర్పర్సన్  ఎన్నిక ఏకగ్రీవం
ముమ్మిడివరం నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆరో వార్డు నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్యర్థిని ములపర్తి  దుర్గా మహేశ్వరిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేతులెత్తే విధానంలో జరిగిన ఈ ఎన్నికలో దుర్గా మహేశ్వరికి మద్దతు తెలుపుతూ తెలుగుదేశం సభ్యులతో పాటు వైసీపీ సభ్యులకు కూడా చేతులెత్తి సంఘీభావం తెలపడం విశేషం. కాగా వైస్ చైర్ మెన్ పదవిని పదవ వార్డు నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచిన అడబాల సతీష్ ఆశించారు. పదవి తనదేనంటూ ప్రచారం చేసుకుని ఆ దిశలో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి టిడిపి అధిష్టానం ముమ్మిడివరం నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ పదవిని ఎస్సీకి కేటాయించాలని ఆదేశాలు జారీ చేయడంతో అనూహ్యంగా ఈ పదవి మలపర్తి దుర్గా మహేశ్వరిని వరించింది.