BREAKING
శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా

Select Suryaa Now
పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా


పదవి అధికారం కాదు-సేవ చేసే భాగ్యం గా భావిస్తా 
-ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అనీషా 
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్
తనకు అందిన పదవిని అధికారం గా భావించకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యంగా భావిస్తానని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అనీషా అన్నారు. ఆమె సోమవారం మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ
ప్రమాణ స్వీకారం జీవితంలో మరచిపోలేని ఘట్టమన్నారు. ఆళ్లగడ్డ లాంటి పెద్ద మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసే గొప్ప అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనపై అపార నమ్మకం ఉంచి చైర్ పర్సన్ పదవి కట్టబెట్టిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భూమా అఖిల ప్రియ మార్గదర్శకం, ఆశీస్సులతోనే తనకు ఈ పదవి దక్కిందని తెలియజేశారు. తాను ఈ  ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.21 కోట్లు మంజూరుకు కృషి చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నీటి సరఫరాకు అవసరమైన రక్షిత ట్యాంకుల నిర్మాణం తో పాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సహకారంతో ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. వర్షాకాలంలో వర్షపు నీటి నిల్వతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యలోప నివారణలో ఆళ్లగడ్డను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అన్ని వీధుల్లో వీధిలైట్లు వెలిగేలా కృషి చేస్తామన్నారు. ఆధునిక పార్కుల ఏర్పాటుతో ప్రజలకు వినోదాన్ని పంచుతామన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సహకారంతో మున్సిపాలిటీలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా కృషి చేస్తామన్నారు. అన్ని వర్గాల వారికి మున్సిపాలిటీలో న్యాయం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతానన్నారు. కౌన్సిలర్లు అందరిని కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు సాగుతానన్నారు. కార్యాలయానికి వివిధ పనులు నిమిత్తం వచ్చే ప్రజానీకానికి ప్రత్యేక గౌరవం అందించి వారి పనులు సకాలంలో అయ్యేలా చూడాలని సూచించారు. అవినీతికి ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మాటల్లో కాకుండా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అభివృద్ధిని అందరి సహకారంతో చేతుల్లో చేసి చూపిస్తామని ఫేక్ అనిషా స్పష్టం చేశారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా