*రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి*
అల్లాదుర్గం; రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటు అని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి ఆరోపించారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, వారి హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయుకుడు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అల్లాదుర్గం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడంపై కృష్ణ గౌడ్ గారు మొండిపడ్డాడు రైతులకు అండగా నిలబడటం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. రైతుల గొంతుకగా నిలిచే వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించలేరని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, రైతుల సమస్యలపై ప్రశ్నించడం నేరం కాదని స్పష్టం చేశారు.ప్రశ్నించే గొంతుకలను కేసులతో అణచివేయలేరు. రైతుల కోసం మా పోరాటం ఆగదు అని నవీన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పల్లె గడ్డ నర్సింలు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి మాజీ సర్పంచ్ శివరాం పార్టీ ఉపాధ్యక్షులు సాయికుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.