తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు
తూప్రాన్; తూప్రాన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఒకే ఒక దరఖాస్తు వచ్చినట్లు మోడల్ అధికారి ఎంపిడిఓ శాలిక పేర్కొన్నారు, తూప్రాన్ మండలంలోని ప్రజావాణి కార్యక్రమానికి 13 శాఖలకు చెందిన అధికారులు హాజరైనట్లు తెలిపారు అందులో తూప్రాన్ పట్టణ మున్సిపాలిటీకి ఆరో వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజావాణిలో ఆర్జీ వచ్చినట్లు తెలిపారు, అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది, మండలాలలో ప్రజావాణి నిర్వహించినప్పటికీ కూడా ప్రజలు తమ మండల స్థానంలో దరఖాస్తులు ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ప్రజలు అలవాటు పడ్డట్టు తెలుస్తుంది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శాలికతో, పాటు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, వైద్యానికి శాఖ సూపర్ండెంట్ అమర్ సింగ్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ మధుసూదన్, మున్సిపల్ నుంచి దుర్గయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు