BREAKING
హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు

పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం

Select Suryaa Now
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం

కౌడిపల్లి;కార్తీక మాసం సందర్భంగా మండల పరిధిలోని షేరితాండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమంలో మహాశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 121 మంది భక్తులు కౌడిపల్లి అభయ రామాంజనేయ స్వామి ఆలయం నుంచి కలశాలను తలపై ధరించి, భక్తి పాటలు,  శివనామస్మరణల మధ్య ర్యాలీగా శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం ఆశ్రమంలోని శివలింగానికి మహిళా భక్తులు 121 కలశాలతో పవిత్ర జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో, ఆశ్రమవాసి చరణ్ గిరి మహారాజ్ పర్యవేక్షణలో నిర్వహించారు. మహా రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలతో ఆశ్రమ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి, తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాశివుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, వార్డు సభ్యులు సందీప్, బొంతమ్మ సంగప్ప,  మరియు వెంకటేష్ గుప్తా, లక్ష్మణ్,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.