BREAKING
శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు

రామాయంపేట;ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు అదనపు కలెక్టర నగేష్ సోమవారం నిజాంపేట్ మండలం నందిగాం గ్రామంలో  ఇందిరమ్మ ఇల్లు, ఫామ్ పాండ్ , ఐకెపి సెంటర్, ఇందిరమ్మ బీమా వంటి పలు కార్యక్రమాలను సందర్శించి తగు సూచనలను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ ముందుగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను  పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి బిల్లుల చెల్లింపులు, నిర్మాణ సామగ్రి లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న ఫామ్ పాండ్స్‌ను సందర్శించారు. భూగర్భ జలాల పెంపుదలకు, రైతులకు సాగునీటి భద్రత కల్పించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నిల్వలు, తేమ శాతం తనిఖీలు, గన్నీ సంచుల లభ్యతను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తూకం వేసి, రవాణా సౌకర్యం కల్పించాలని, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని  స్పష్టం చేశారు. ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులందరికీ బీమా కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందాలని కలెక్టర్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న రమేష్ తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీ ఓ రజినీకాంత్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి యాదవ లక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ హేమలత జిపిఓ వనజ ఆర్ ఐ ప్రీతి సర్వేయర్ ప్రశాంత్ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ రాజలింగం నాయకులు బాల్రెడ్డి మైసయ్య ఆకుల శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు