BREAKING
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్

Select Suryaa Now
పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్

గుంటూరు  : నందిగామ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శాఖమూరి వంశీధర్‌ను ఆయన పూలమాల, శాలువాతో సత్కరించి అభినందించారు. నూతన చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు అప్పగించిన పదవులను హోదాలుగా కాకుండా బాధ్యతలుగా భావించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నందిగామ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు చైర్మన్, కౌన్సిలర్లందరూ పూర్తి సహకారం అందిస్తూ సమన్వయంతో పనిచేసి నందిగామను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నూతన చైర్మన్ శాఖమూరి వంశీధర్ కలిసి తాళ్ళ వెంకటేష్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

 

సూర్య నాయక్