విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
నర్సాపూర;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సోమవారం ప్రభుత్వ పాఠశాలలో ఆయా గ్రామాల సర్పంచులు మాడాపూర్ గ్రామ సర్పంచ్ రమావత్ సునీత రాములు నాయక్ ఉప సర్పంచ్ సంతోషా అశోక్ గౌడ్ మంతూర్ గ్రామ సర్పంచ్ మల్ దొడ్డి వెంకన్న , ఖాజీపేట గ్రామ సర్పంచ్ దొంతి యాదగిరి గౌడ్ నాగులపల్లి సర్పంచ్ కొర్పోల్ సుమతి శివకుమార్ చిన్న చింతకుంట సర్పంచ్ ప్యాట సరిత మహేష్ బ్రాహ్మణపల్లి సర్పంచ్ ఆనంద్ యాదవ్ రెడ్డి పల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ చిప్పల్ తూర్తి గ్రామ సర్పంచ్ ముస్కూరి సుధాకర్ లు హాజరై అల్పాహార పథకాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. నిరు పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సర్పంచులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…