ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు
మాసాయిపేట;మాసాయిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కేవలం ఒకే ఒక దరఖాస్తు వచ్చింది. అది కూడా ప్రస్తుతం మంజూరు కానీ వృద్ధాప్యం సంబంధించిన దరఖాస్తు వచ్చింది. దాదాపు శాఖల అధికారులు పాల్గొన్నప్పటికీ, ఫిర్యాదుర్ల కంటే ఆర్జీలు స్వీకరించే అధికారులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాహసిల్దార్ జ్ఞానయోతి, ఎంపీఓ నరేష్, మండల పశువైద్యాధికారి రేఖ రసజ్ఞ, ఏవో కవిత, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.