కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన
కొల్చారం;మెదక్ రూరల్ సర్కిల్ సీఐ ఎం. కృష్ణమూర్తి ఎస్సై మహమ్మద్ మోహినిద్దీన్ కొల్చారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, వ్యక్తిగత సమాచార భద్రతపై వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని తెలిపారు.బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలన వివరిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థినులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సీఐ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.