BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు

సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

Select Suryaa Now
సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

కౌడిపల్లి;సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్ తెలిపారు.సోమవారం కౌడిపల్లి మండలం సదాశివ పల్లి గ్రామంలో భూ భారతి భూముల రీ సర్వేను ఏడి ల్యాండ్ సర్వే కిషన్ తో  కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈరోజు వరకు 11 నాన్-కెడాస్ట్రల్ (సర్వే మ్యాప్‌లు లేని) గ్రామాలు, 13 కెడాస్ట్రల్ (సర్వే మ్యాప్‌లు ఉన్న) గ్రామాలు — మొత్తం కలిపి 24 గ్రామాలకు గా ను 43,556 ఎకరాల గుంటల విస్తీర్ణంలో భూమి సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. సమగ్ర భూ సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, రైతుల భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన రికార్డులు రూపొందించడం జరుగుతుందని అన్నారు. భూముల కొలతలలో వ్యత్యాసాలు, సర్వే నంబర్లలో గందరగోళం, భూముల హద్దుల విషయంలో రైతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఒకరి భూమిలోకి మరొకరు ఆక్రమణలు జరగడం వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపట్టిందని తెలిపారు. గతంలో భూముల కొలతలు, పట్టా రికార్డులు, వాస్తవ సాగులో ఉన్న భూముల విస్తీర్ణం మధ్య వ్యత్యాసాలు ఉండటంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించి పారదర్శకమైన భూ రికార్డులు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. సర్వే ప్రక్రియలో భాగంగా రైతులకు జెండాలను అందజేయడం జరుగుతుందని, సంబంధిత భూముల సర్వే తేదీకి రెండు రోజుల ముందుగానే రైతులు తమ భూముల 4 వైపులా జెండాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో భూములను కొలతలు వేసి, ఖచ్చితమైన హద్దులు గుర్తించి డిజిటల్ మ్యాపులను రూపొందిస్తారని తెలిపారు. భూములకు సంబంధించిన కో-ఆర్డినేట్స్ ఆధారంగా భవిష్యత్తులో ఎప్పుడైనా భూముల హద్దులను గుర్తించే అవకాశం ఉంటుందని, తద్వారా భూ ఆక్రమణలు, హద్దుల వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన భూమి విస్తీర్ణం, అందులో ఉన్న పట్టాదారులు, వారి భూముల వివరాలను అనుసంధానం చేసి సమగ్ర మ్యాపులను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూముల కొనుగోలు, అమ్మకాలు, వారసత్వ బదిలీలు జరిగినప్పుడు మ్యాపులలో సంబంధిత మార్పులు నమోదు అవుతాయని, తద్వారా భూ రికార్డులలో పారదర్శకత పెరుగుతుందని వివరించారు.సర్వే ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సహకారంతో సర్వే నిర్వహిస్తే పనులు మరింత వేగంగా పూర్తవుతాయని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి సర్వే కిషన్, స్థానిక తాహాసిల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.