BREAKING
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ

Select Suryaa Now
నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ

నర్సాపూర్; పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి సహాయనిధి లక్ష్యమని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 262 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు CMRF ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు.2024 నుంచి 2026 వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో CMRF ద్వారా 2,113 మంది లబ్ధిదారులకు రూ.8.21 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని, LOC ద్వారా 160 మందికి రూ.7 కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు.ప్రజలకు అందాల్సిన సంక్షేమ సహాయంలో అవినీతికి తావులేదని, CMRF నిధుల్లో అవినీతి చేయడం నేరమే కాకుండా పాపమని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సహాయం అత్యంత పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజల కష్టాల్లో అండగా నిలవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం తమ బాధ్యతని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల మల్లేశం పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఎన్ ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ వర్ధన్ సర్పంచులు ఉదయ్ కుమార్ శివకుమార్ శ్రీనివాస్ గుప్తా మణిదీప్ ఆనంద్ యాదవ్ సురేష్ నాయక్ కార్యదర్శి స్వాతి _ ప్రవీణ్ నాయకులు శ్రీనివాసరావు మల్లేశం శ్రీనివాస్ రెడ్డి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .