BREAKING
పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం

ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం

Select Suryaa Now
ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జలసిరి పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  అన్నారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కుటుంబ భరోసా భీమా నమోదు ప్రక్రియను మరియు జలసిరి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని 18 నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న వ్యక్తి బీమా వ్యక్తిగా ప్రతిపాదించబడతారని, భీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేసి, నామిని వివరాలను తెలియపరిచి స్వయంగా అందించాలని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని, దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నామినీ ఎంపిక విషయంలో సంబంధిత లబ్ధిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో  గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని,ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల నాణ్యతతో పాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్

తదితరులు పాల్గొన్నారు.