BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: అవగాహన సదస్సులో వక్తలు

Select Suryaa Now
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: అవగాహన సదస్సులో వక్తలు

సూర్య - మానకొండూర్: మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం '100 రోజుల బాల్య వివాహ రహిత భారత్' అవగాహన సదస్సు నిర్వహించారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ , మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మిరుపూరి వెంకటేష్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు జరిపించినా, అందుకు సహకరించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ.. పిల్లలకు ఉండే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు సామాజిక మాధ్యమాల (ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్) పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన యాప్ పర్మిషన్లు ఇవ్వకూడదని సూచించారు. పాఠశాలల పరిసరాల్లో తెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు లేదా ఇతర పదార్థాలను తీసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని కోరారు. ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించినా, సేవించినా వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు తెలపాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంచార్జ్ డాక్టర్ సుమన్ కుమార్, సోషల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు, ఎస్‌ఆర్‌డీఓ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కోమల, విద్యార్థులు పాల్గొన్నారు.