మూడవ రాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్
గుంటూరు : మున్సిపల్ ఎన్నికల సిబ్బంది మూడవ రాండమైజేషన్ సోమవారం పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ, వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ జిల్లా అధికారి మోహనని పాల్గొన్నారు.
సూర్య నాయక్