BREAKING
27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !! నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం మూడవ రాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు గ్లోబల్ ఇస్లామిక్ బ్యాంకింగ్ హబ్‌గా దుబాయ్ సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం టీపీసీసీ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు ఘన సన్మానం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: అవగాహన సదస్సులో వక్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త: 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన' కింద రూ. 6,000 వరకు ఆర్థిక సాయం.. అర్హతలు, ప్రయోజనాల పూర్తి వివరాలు వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

Select Suryaa Now
డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు  ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, ఏఐ స్టాక్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్దేశించారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు

ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే మరింత మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుంటూ, ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి, అత్యుత్తమ పనితీరు సాధించేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అత్యంత కీలకంగా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కొలమానంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆర్థిక శాఖ, మున్సిపల్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు.